COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి, బీ అలర్ట్

How To Improve Oxygen Levels | ప్రస్తుతం రోజు వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, 2 వేల పైగా కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత, కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత పలుచోట్ల సమస్యత్మాకంగా మారుతోంది. కరోనా కిట్ల కొరత కారణంగా కోవిడ్19 పరీక్షా కేంద్రాలు టోకెన్లు ఇచ్చి మూడు నాలుగు రోజుల తరువాత వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 22, 2021, 02:45 PM IST
COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి, బీ అలర్ట్

How To Improve Oxygen Levels | గత ఏడాది తొలిరోజుల్లో కరోనా వైరస్ గురించి అంతగా తెలియని సమయంలో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు పెరిగేకొద్దీ ప్రజలు పరిశుభత్ర, శానిటేషన్, మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలు పాటించడం తగ్గించారు. ఇక అది మొదలు కరోనా భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం రోజు వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, 2 వేల పైగా కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. 

దేశంలో ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల కొరత, కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత పలుచోట్ల సమస్యత్మాకంగా మారుతోంది. కరోనా కిట్ల కొరత కారణంగా కోవిడ్19 పరీక్షా కేంద్రాలు టోకెన్లు ఇచ్చి మూడు నాలుగు రోజుల తరువాత వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కానీ కరోనా లక్షణాలున్నాయని, తమకు కరోనా వైరస్(CoronaVirus) సోకిందా అనేది తేలడానికి 5 రోజుల సమయం పడితే అంతలోనే పేషెంట్ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలిసిందే. ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి పడిపోతే కరోనా సోకిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుని, తక్షణమే చికిత్స ప్రారంభించడంతో పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయి ఇళ్లకు వెళుతున్నారు. 

Also Read: COVID-19 Dos And Donts: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకోండి

మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి సాధారంగా 94 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులు, సంబంధిత సమస్య ఉన్న వారిలో ఆక్సిజన్ స్థాయి 88-92 వరకు ఉంటుంది. అయితే ఆక్సిజన్ స్థాయి పెంచుకునేందుకు ఓ చిన్న చిట్కాను పాటిస్తే సరి అని తెలుస్తోంది. ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన తాను పాటించిన చిట్కాను వీడియో తీసి పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్‌స్ట్రెస్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్న వారికి వైద్యులు ఈ తరహా చికిత్స అందిస్తారని సమాచారం. 

Also Read: Ashish Yechury Death News: కరోనాతో సీపీఎం నేత Sitaram Yechury కుమారుడు మృతి

ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు బోర్లా పడుకుని శ్వాస గట్టిగా తీసుకుంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న ప్రారంభ దశలోనే ఇలాంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది. శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్యోతి మట్టా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. బోర్లా పడుకుని(Prone position) లేదా మీ ఉదరభాగం నేలకు తాకించి నిద్రించే స్థితిలో ఉండి గట్టిగా శ్వాస తీసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని, ఇది కోవిడ్19(COVID-19) బాధితులకు మేలు చేస్తుందన్నారు. 

ప్రతి ఒక్కరికి, ప్రతి దశలో కరోనా బాధితులకు ఇది పనిచేస్తుందని మాత్రం చెప్పలేమన్నారు. ఆక్సిజన్ స్థాయి అప్పుడే తగ్గుతున్న వారు, లేదా ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవాలనుకునే వారిలో అధిక శాతం ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఆక్సిజన్ స్థాయిలు 94కి తగ్గిపోతున్నట్లు గమనిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వారి సూచిన మేరకు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.

Also Read: Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News